కర్ణాటక లోని మంగళూరుకు చెందిన 23 ఏళ్ల సుమంత్, చెన్నైలో రాజీవ్ గాంధీ కళాశాలలో ఎంఎస్సీ చదువుతున్నాడు. తిరుపతికి చెందిన సహ విద్యార్థితో కలిసి తలకోన పర్యటనకు వెళ్లాడు. తలకోన వాటర్ ఫాల్స్ కి వెళ్లి స్నేహితులందరూ సరదాగా జలకాలాటాడారు. ఈ క్రమంలో సుమంత్ తాను ఎత్తు నుంచి నీటిమడుగులోకి తలకిందులుగా దూకే విన్యాసం డైవ్ వేస్తుండగా వీడియో తీయమని మిత్రులను కోరాడు. వారు మొబైల్ కెమెరాల్లో వీడియో తీస్తుండగా స్టిల్ కోసం పైనుంచి నీటి మడుగులోకి తలకిందులుగా దూకాడు. అయితే, నీటి అడుగు భాగాన కొక్కెర రాళ్లు, బండరాల మధ్యలో చిక్కుకొని నీటి అడుగులోనే ఆగిపోయాడు. ఎంతసేపు చూసినా అతను నీటి పైకి రాకపోవడంతో షాక్ తిన్న స్నేహితులు గంట సేపు అక్కడే అతని ఎదురు చూశారు. ఎంతకీపైకి రాకపోవడంతో అంతా వెతికారు. పైనుండి చూస్తే ఆ స్వచ్ఛమైన నీటి అడుగు భాగంలో సుమంత్ ఇరుక్కుపోయినట్టు గుర్తించారు.. అప్పటికే చీకటి పడటంతో అక్కడున్న వారికి చెప్పి తిరిగి వెళ్లిపోయారు. ఆ విషయాన్ని ఎలావారిపాలెం ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలియజేశారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. https://t.me/offerbazaramzon
వీడియో కోసం జంప్ చేసి ప్రాణాలు పోగొట్టుకున్నాడు !
July 01, 2023
0
Tags