హైదరాబాద్ లోని సరూర్‌నగర్‌లో సక్సెస్ కళాశాలలో గ్రూప్ -4 పరీక్ష రాస్తూ సెల్‌ఫోన్‌తో ఓ అభ్యర్థి పట్టుబడ్డాడు. పరీక్ష ప్రారంభమైన అరగంట తర్వాత ఇన్విజిలేటర్ గుర్తించి అభ్యర్థి నుంచి ఫోన్ తీసుకుని సీజ్ చేశారు. మాల్ ప్రాక్టీస్ కింద అభ్యర్థిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన మినహా ఉదయం సెషన్‌లో జరిగిన గ్రూప్-4 పేపర్-1 పరీక్ష ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్ తెలిపారు. 8,180 ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్షకు 9,51,321 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు జనరల్ స్టడీస్ పరీక్ష రాశారు. మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సెక్టరేరియల్ ఎబిలిటీస్ పరీక్షను అభ్యర్థులు రాయనున్నారు. కొన్ని చోట్ల వివిధ కారణాలతో అభ్యర్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోలేకపోవడంతో నిర్వాహకులు పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. దీంతో వారు నిరాశతో వెనుదిరిగారు. https://t.me/offerbazaramzon
గ్రూప్ -4 పరీక్ష రాస్తూ ఫోన్‌తో పట్టుబడ్డ అభ్యర్థి !
July 01, 2023
0
Tags