ఉత్తర ప్రదేశ్ లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. ప్రభుత్వం ఎస్టీఆర్ఎఫ్, ఎన్టీఆర్ఎఫ్ బృందాల సాయంతో పరిస్ధితిని చక్కదిద్దేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. సీఎం యోగీ ఆదిత్యనాథ్ సమీక్ష నిర్వహించారు. ఉత్తర ప్రదేశ్ కు పొరుగున ఉన్న ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని యోగి ఆదిత్యనాథ్ అధికారుల్ని ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ సమీక్షా సమావేశంలో తాజా పరిస్థితిని యోగీ సమీక్షించారు. ముఖ్యంగా నది కట్టలను పర్యవేక్షించాలని అధికారులను కోరారు. ఎస్టీఆర్ఎఫ్, ఎన్టీఆర్ఎఫ్ బృందాలు వరద యూనిట్లతో పాటు విపత్తు నిర్వహణ బృందాలు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా, ఉత్తరప్రదేశ్‌లోని పలు నదులలో రాబోయే కొద్ది రోజుల్లో నీటి మట్టాలు పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నీటిపారుదల, జలవనరుల శాఖతో పాటు ఇతర శాఖల అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ సూచించారు. కట్టలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని ఆదేశించారు. వరదలు లేదా భారీ వర్షాల వల్ల ప్రభావితమైన ప్రాంతాల్లో సహాయక చర్యల్లో జాప్యం జరగకూడదని తెలిపారు. బాధిత కుటుంబాలకు అవసరమైన ప్రతి సహాయాన్ని తక్షణమే అందుబాటులో ఉంచాలని ఆదిత్యనాథ్ ఆదేశించారు. https://t.me/offerbazaramzon
ఉత్తర ప్రదేశ్ లో భారీ వర్షాలు !
July 10, 2023
0
Tags