నిత్యావసర ధరలు పెరిగిపోవడంపై మల్లికార్జున ఖర్గే ఆందోళన

Telugu Lo Computer
0


దేశంలో రోజురోజుకూ నిత్యావసర ధరలు పెరిగిపోవడంపై కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. ధరలు మిన్నంటడానికి మోడీ  ప్రభుత్వమే కారణమని బుధవారం ట్విటర్‌ వేదికగా ఆరోపించారు. అంతేకాకుండా నిరుద్యోగ సమస్యతో యువత ఇబ్బందులు ఎదుర్కొంటోందని అన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం పెరగడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమంటూ మండిపడ్డారు. ఈ వైఫల్యాల కారణంగా వచ్చే ఏడాది ఎన్నికల్లో భాజపా గద్దె దిగడం ఖాయమన్నారు. భాజపాకు వ్యతిరేకంగా ఓటేసి ప్రజలే సరైన సమాధానం చెబుతారన్నారు. మోడీ సర్కార్‌ సామాన్యుల పట్ల నిర్లక్ష్యం వహిస్తోందని, అందువల్లే కూరగాయల ధరలు మిన్నంటాయన్నారు. ''దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటు 8.45 శాతం పెరిగింది. గ్రామాల్లో 8.73 శాతానికి చేరుకుంది. ఉపాధి హామీ పథకం డిమాండ్‌ గరిష్ఠ స్థాయికి చేరుకున్నా, పనులు కల్పించడం మాత్రం ప్రభుత్వం విఫలమైంది. దీంతో గ్రామీణ కూలీ రేటు కూడా తగ్గింది. ప్రధాని మోడీ ప్రకటనలతో ప్రభుత్వ వైఫల్యాలను దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి వైఫల్యాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు తగిన బుద్ధి చెబుతారు'' అని విమర్శించారు.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)