త్రిపుర అసెంబ్లీలో ఐదుగురు ఎమ్మెల్యేల సస్పెండ్ !

Telugu Lo Computer
0


త్రిపుర అసెంబ్లీలో నిరసనల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. అసెంబ్లీలో అశ్లీల వీడియోల వ్యవహారంలో బీజేపీ ఎమ్మెల్యే జడాబ్ లాల్ దేబ్‌నాథ్‌ను సస్పెండ్ చేయాలని త్రిపుర మోత పార్టీ (టీఎంపీ), సీపీఐ-ఎమ్‌, కాంగ్రెస్‌లు డిమాండ్ చేశాయి. అశ్లీల వీడియో అంశంపై చర్చిండానికి ప్రతిపక్ష నేత అనిమేష్ డెబ్బర్మ వేసిన వాయిదా తీర్మాణాన్ని స‍్పీకర్ తిరస్కరించగా.. సభలో నిరసనలు మొదలయ్యాయి. అయితే.. మరికాపేటికే ఎమ్మెల‍్యేల సస్పెన్షన్‌ నిర్ణయంపై స్పీకర్ వెనక్కి తగ్గారు. అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి ప్రణజిత్ సింఘా రాయ్‌ 2023-2024 ఏడాదికి బడ్జెట్ ప్రవేశపెడుతుండగా.. ప్రతిపక్షాలు నిరసనలు ప్రారంభించాయి. ప్రతిపక్ష నేతలు పోడియంలోకి ప్రవేశించారు. నినాదాలు చేస్తూ.. ఒకరికొకరు చేతులు కలుపుతూ గొలుసు మాదిరిగా ఏర్పడ్డారు. మరికొందరు నేతలు బల్లాల మీదకు ఎక్కారు. దీంతో స్పీకర్ బిశ్వ బిందు సేన్‌ ఐదుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే సుదిప్ రాయ్‌ బర్మన్, నాయన్ సర్కార్, బ్రిషకేతు డెబ్బర్మ, నందితా రియాంగ్, రంజిత్ డెబ్బర్మలు సస్పెన్షన్ లిస్ట్‌లో ఉన్నారు. దేబ్‌నాథ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష నేతలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. మళ్లీ అదే రోజు ఎమ్మెల్యేల సస్పెన్షన్ నిర్ణయాన్ని స్పీకర్‌ వెనక్కి తీసుకున్నారు.   https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)