రెండేళ్లలో రెండు పెద్ద పార్టీలను చీల్చిన బీజేపీ !

Telugu Lo Computer
0


రెండేళ్లలో రెండు 'మహా' కుట్రలకు బీజేపీ పాల్పడింది. మహారాష్ట్రలో దొంగచాటుగా అధికారంలోకి వచ్చేందుకు ఆ రాష్ట్రానికి చెందిన రెండు అతి పెద్ద పార్టీలను విచ్ఛిన్నం చేసింది. 2022లో శివసేను, తాజాగా ఎన్సీపీని బీజేపీ చీల్చింది. 2022లో తొలుత శివసేన విచ్ఛిన్నానికి బీజేపీ కుట్ర పన్నింది. దీంతో శివసేన నేత ఏక్‌నాథ్‌ షిండే ఆ పార్టీలో తిరుగుబాటు చేశారు. 39 మంది ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేపై ఆయన ఎదురుతిరిగారు. ఈ పరిణామాల వల్ల గత ఏడాది జూన్‌లో సీఎం పదవికి ఉద్ధవ్‌ రాజీనామా చేయడంతో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కూడిన మహా వికాస్ అఘాడి సంకీర్ణ ప్రభుత్వం పడిపోయింది. అనంతరం 2022 జూన్‌ 30న ఏక్‌నాథ్‌ షిండే సీఎంగా, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో శివసేన రెబల్‌ వర్గం, బీజేపీ కలిసి మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఈ పరిణామాల వల్ల ఆ రాష్ట్రంలో అత్యంత బలమైన శివసేన పార్టీ రెండుగా చీలింది. సరిగ్గా ఏడాది తర్వాత మహారాష్ట్రలో రెండో అతి పెద్ద విపక్ష పార్టీ అయిన నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ)ని కూడా బీజేపీ విచ్ఛిన్నం చేసింది. రాజకీయ కురువృద్ధుడైన శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఆ పార్టీని చీల్చింది. ఎన్సీపీ సీనియర్‌ నేత అజిత్‌ పవర్‌తో తిరుగుబాటు చేయించింది. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)