ఐఏఎఫ్‌ అధికారిణిపై దాడి !

Telugu Lo Computer
0


పంజాబ్ లోని పఠాన్‌కోట్‌లో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఐఏఎఫ్‌ అధికారిణిపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు మంగళవారం వెల్లడించారు. ఐఏఎఫ్‌ అధికారిణి తన ఇంట్లో నిద్రిస్తుండగా ఓ వ్యక్తి సోమవారం రాత్రి ఆమె ఇంట్లో దొంగతనానికి యత్నించాడు. శబ్దం రావడంతో ఆమె మేల్కొన్నారు. అతన్ని అడ్డుకోవడంతో ఆమెపై కత్తితో దాడి చేసి పారిపోయాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. మరుసటి ఉదయం బాధితురాలి ఇంటికి వెళ్లిన మరో మహిళా అధికారి ఆమెను గాయాలతో పడి ఉండటాన్ని చూశారు. వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని మఖన్‌సింగ్‌గా గుర్తించారు. నిందితుడు బాధితురాలి ఇంటి సమీపంలోనే ఉంటున్నాడు. అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. ఐఏఎఫ్‌ అధికారిణి ఒంటరిగా ఇంట్లో ఉంటున్న విషయం తెలిసిన మఖన్‌సింగ్‌ ఈ దాడికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)