మహారాష్ట్రలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ లో చోటుచేసుకున్న తాజా సంక్షోభ పరిణామాలపై సీనియర్ రాజకీయ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ స్పందిస్తూ 'ప్రధాని మోడీ చెప్పుకునే మదర్ ఆఫ్ డెమోక్రసీ అంటే ఇదేనేమో..?' అని ఆయన వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. 'అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పిన మదర్ ఆఫ్ డెమోక్రసీ ఇదే కావచ్చు' అని సిబల్ ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. కాగా, ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ అక్కడి కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తూ భారత దేశం ప్రజస్వామ్యానికి తల్లి లాంటిదని చెప్పారు. ఈ వ్యాఖ్యలనే ప్రస్తావిస్తూ కపిల్ సిబల్.. బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. https://t.me/offerbazaramzon
'మదర్ ఆఫ్ డెమోక్రసీ అంటే ఇదేనా ?'
July 02, 2023
0
Tags