రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్, రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్, రిఫైన్డ్ పామోలిన్ ఆయిల్ ధరలు భారీగా తగ్గాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సన్‌ఫ్లవర్ ఆయిల్ రేటు 29 శాతం మేర, సోయాబీన్ ఆయిల్ రేటు 19 శాతం దిగి వచ్చింది. పామోలిన్ ఆయిల్ రేటు 25 శాతం మేర క్షీణించింది. గత ఏడాది కాలంలో ఆయిల్ రేట్లు ఈ మేరకు దిగి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలు కారణంగా, అలాగే అంతర్జాతీయ మార్కెట్లో వంట రూనె ధరలు భారీగా దిగి రావడం వంటి అంశాల నేపథ్యంలో దేశంలో ఆయిల్ రేట్లు భారీగా దిగి వచ్చాయని చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో తాజాగా ఈ విషయాన్ని వెలడించింది. ఆహారం, వినియోగదారుల వ్యవహరాల శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ఈ విషయాన్ని వెల్లడించారు. లిఖిత పూర్వంగా ఈ మేరకు సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం వంట నూనె ధరలను నిశితంగా గమనిస్తూ వస్తోందని, గ్లోబల్ మార్కెట్‌లో రేట్ల తగ్గుదల ప్రయోజనాన్ని వినియోగదారులకు పూర్తిగా అందేలా పని చేస్తోందని వివరించారు. ప్రముఖ ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్స్, పరిశ్రమ వర్గాలతో రెగ్యులర్‌గా సమావేశాలు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. అలాగే అంతీర్జాతీయ మార్కెట్‌లోని రేట్లకు అనుగుణంగా దేశీ మార్కెట్‌లో కూడా ధరలు తగ్గించాలని వారికి తెలియ జేస్తున్నామని వివరించారు. 2023 జూలై 20 నాటికి చూస్తే.. క్రూడ్ సోయాబీన్ ఆయిల్, క్రూడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్, క్రూడ్ పామ్ ఆయిల్, రిఫైన్డ్ పామ్ ఆయిల్స్ ధరలు గత ఏడాది కాలంలో భారీగా తగ్గాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వ్లల రిఫైన్డ్ సన్‌ఫ్లవర్, సోయాబీన్ ఆయిల్, ఆర్‌బీడీ పామోలిన్ ఆయిల్స్ ధరలు భారీగా తగ్గాయని తెలిపారు. ఇక పోతే కేంద్ర ప్రభుత్వం దేశీ మార్కెట్‌లో వంట నూనె ధరలు తక్కువ స్థాయిలో ఉంచటానికి గత రెండేళ్ల కాలంలో క్రూడ్, రిఫైన్డ్ ఆయిల్స్ దిగుమతులపై సుంకాలను పలు మార్లు తగ్గించింది. దీని వల్ల కూడా రేట్లు దిగి వచ్చాయని చెప్పుకోవచ్చు. https://t.me/offerbazaramzon
దిగొచ్చిన వంట నూనె ధరలు !
July 27, 2023
0
Tags