మణిపూర్ లో గత రెండున్నర నెలలుగా హింస కొనసాగుతూనే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఎటువంటి హెచ్చరికలు జారీ చేసినా ఇప్పటికే హింస ఆగడం లేదు. తాజాగా మణిపూర్‌లో ఒక ఇంట్లోకి చొరబడిన దుండగులు 50 ఏళ్ల మహిళను దారుణంగా కాల్చి చంపారు. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లోని ఈస్ట్ జిల్లా సావోంబంగ్ ప్రాంతంలో 50 ఏళ్ల వయసున్న మహిళ ముఖంపై దుండుగులు కాల్పులు జరిపారు. ఆమె ఇంట్లోకి చొరబడి మరీ ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆమె ముఖాన్ని వికృతంగా మార్చేసి అక్కడి నుంచి పారిపోయారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే మణిపూర్ పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. సమీప ప్రాంతంలోని కొన్ని ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనలో చనిపోయిన మహిళ కొంత మానసిక అనారోగ్యంతో బాధపడుతోందని.. ఆ మహిళ మారింగ్ నాగా కమ్యూనిటీకి చెందినట్టు తెలుస్తోంది. అయితే ఆ మహిళ ఎవరనే విషయాన్ని పోలీసులు ఇంకా వెల్లడించలేదు. ఈ హత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రజల వాంగ్మూలాలు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. https://t.me/offerbazaramzon
మహిళను కాల్చి చంపిన దుండగులు
July 16, 2023
0
Tags