ఆధార్‌-పాన్‌ లింక్‌ చలాన్‌ పై ఐటీ శాఖ ప్రకటన

Telugu Lo Computer
0


ధార్‌-పాన్‌ అనుసంధానానికి సంబంధించి గడువు శుక్రవారంతో ముగిసింది. ఆదాయపన్ను శాఖ కీలక ప్రకటన చేసింది. ఆధార్‌-పాన్‌ లింక్‌ కోసం చెల్లింపులు చేసిన తర్వాత చలాన్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడంలో కొంతమంది యూజర్లు సమస్యను ఎదుర్కొంటున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో చలాన్‌ కోసం చెల్లింపులు చేసిన తర్వాత ఐటీ వెబ్‌సైట్‌లో లాగిన్‌ చేసి ఈ-పే ట్యాక్స్‌ సెక్షన్‌లో చెల్లింపు పూర్తయిందా ? లేదా ? అనేది తెలుసుకోవచ్చని సూచించింది. అందులో లావాదేవీలు పూర్తయినట్లు చూపిస్తే ఆధార్‌-పాన్‌ లింక్‌ చేసుకోవచ్చని తెలిపింది. అలానే, పాన్‌-ఆధార్‌ లింక్‌ కోసం చలాన్‌ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. చెల్లింపు పూర్తయిన తర్వాత పాన్‌కార్డు హోల్డర్స్ రిజిస్టర్డ్‌ ఈ-మెయిల్‌కు చలాన్‌ చెల్లింపులకు సంబంధించిన రశీదు కాపీ వస్తుందని వెల్లడించింది. ఒకవేళ నగదు చెల్లింపు పూర్తయిన తర్వాత ఆధార్‌-పాన్‌ లింక్‌ ప్రక్రియ పూర్తి కాకపోతే అలాంటి వాటిని ఆదాయపన్ను శాఖ పరిగణలోకి తీసుకుంటుందని ఓ ప్రకటనలో తెలిపింది. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)