గత ఏడాది 90 నుంచి 100 రూపాయలుగా ఉన్న కిలో కందిపప్పు, ప్రస్తుతం రిటైల్ మార్కెట్ లో కిలో 130 రూపాయల వరకు పలుకుతుంది. గత ఏడాదితో పోల్చుకుంటే పప్పు ధాన్యాల ధరలు 7 నుంచి 32 శాతం వరకు ధరలు పెరిగాయని కేంద్రం గుర్తించింది. ఈ క్రమంలోనే పప్పు ధాన్యాల ధరలను కంట్రోల్ చేయటంతోపాటు, పేదలకు సరసమైన ధరలకు కందిపప్పు అందించాలనే ఉద్దేశంతో భారత్ బ్రాండ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 702 నాఫెడ్, మదర్ డైరీ, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే దుకాణాల ద్వారా విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఆయా రాష్ట్రాల్లో రేషన్ షాపులు, సహకార సంఘాలు విక్రయించే దుకాణాలు, జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నడిచే దుకాణాల ద్వారా వీటిని సరఫరా చేయాలని ప్రణాళిక రచించింది. ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం ఇవ్వటంతోపాటు.. సబ్సిడీపై కందిపప్పును పంపిణీ చేయటానికి కేంద్రం చర్యలు తీసుకుంది. కందిపప్పును కిలో 60 రూపాయలకే అందించాలని నిర్ణయించింది. దీని వల్ల రిటైల్ మార్కెట్ లోనూ ధరలు తగ్గుతాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది. https://t.me/offerbazaramzon