రసీదు లేకుండా రూ.5 వేల ఫైన్ వేసిన ట్రాఫిక్ పోలీస్ !

Telugu Lo Computer
0


కొరియా దేశానికి చెందిన ఓ వ్యక్తి ఢిల్లీలో రోడ్డు సైడ్‌కు కారు ఆపుకుని నిలబడ్డాడు. ఇంతలో కారు వద్దకు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసు మహేశ్ చంద్ అక్కడికి వచ్చాడు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఫైన్ చెల్లించాలని కొరియన్‌కు చెప్పాడు. దీంతో రూ.500 నోటు తీసుకుని ఇచ్చాడు. అయితే రూ.500 కాదు, రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో ఆ విదేశీయుడు ఏం చేయలేక ట్రాఫిక్ పోలీస్ అడిగిన రూ.5 వేలను ఇచ్చేశాడు. ఈ డబ్బులు తీసుకున్న మహేశ్ చంద్, ఎలాంటి రసీదు ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన అంతా కారులోని కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, ఉన్నతాధికారులు స్పందించారు. ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ  ట్రాఫిక్ పోలీసును వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేశారు. శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. ఇలాంటి ఘటనలు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విచారణకు హాజరైన మహేశ్ చంద్, తాను చలాన్ రశీదు ఇవ్వబోతున్నానని పేర్కొన్నాడు. అయితే కారు యజమాని అక్కడి నుంచి వెళ్లిపోయాడని చెప్పాడు. అయితే వీడియోలో ట్రాఫిక్ పోలీసు రసీదు ఇచ్చే ఉద్దేశంతో కనిపించలేదు. డబ్బులు ఇచ్చిన కొరియన్, మహేశ్‌ చంద్‌తో మాట్లాడి ధన్యవాదాలు చెప్పాడు. చివరికి షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)