స్మార్ట్‌ఫోన్ కొంటే 2 కిలోల టమాటాలు ఉచితం !

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్‌కు చెందిన అభిషేక్‌ అగర్వాల్‌ అనే వ్యాపారి తన స్టోర్‌లో మొబైల్‌ కొనుగోలు చేసిన వారికి రెండు కిలోల టమాటాలు ఉచితంగా ఇస్తామని ప్రచారం చేశాడు. టమాటా ధర అధికంగా ఉన్న కారణంగా ఫోన్లు కొనుగోలు చేయాలనుకొనే వారు తన వద్దకు వస్తారని భావించాడు. వ్యాపారి అనుకున్నదే జరిగింది. ఈ ఆఫర్‌ తనకు విజయాన్ని తెచ్చిపెట్టిందని. ఉచిత టమాటో ఆఫర్ ప్రారంభించిన నుంచి తన స్టోర్‌లో వినియోగదారుల సంఖ్య పెరిగిందని వ్యాపారి అగర్వాల్‌ పేర్కొన్నాడు. ఇప్పటి వరకు మొబైల్‌ కొనుగోలు చేసిన కస్టమర్లకు సుమారు క్వింటా టమాటోలు ఉచితంగా ఇచ్చినట్లు తెలిపారు. ఈ టమాటో ఆఫర్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ అవుతుందని చెప్పారు. చాలా మంది ట్రోల్స్‌ కూడా చేస్తున్నారని పేర్కొన్నారు. https://t.me/offerbazaramzon


Post a Comment

0Comments

Post a Comment (0)