ఈ నెల 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జులై 19న అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నది. పార్లమెంట్ సమావేశాలకు ముందు అన్ని పార్టీలు సమావేశం కావడం గత కొన్నేళ్లుగా సాంప్రదాయంగా వస్తోంది. గతంలో ప్రధాని మోడీ కూడా ఈ తరహా సమావేశాలకు హాజరయ్యారు. రాజ్యసభ చైర్‌పర్సన్ జగదీప్ ధన్‌ఖర్ కూడా మంగళవారం అఖిల పక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. అయితే ప్రతిపక్ష నెతలెవరూ అందుబాటులో లేకపోవడంతో ఈ సమావేశం రద్దయ్యింది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో బిజెపి, ప్రతిపక్ష పార్టీలు పరస్పరం దాడులకు తెగబడుతున్న నేపథ్యంలో ఈ సమావేశాలు రసవత్తరంగా సాగుతాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మణిపూర్ హింసాకాండ, ధరల పెరుగుదల, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి. https://t.me/offerbazaramzon
19న అఖిల పక్ష సమావేశం
July 18, 2023
0
Tags