చాలా మంది స్నేహితులు కావాలనుకుంటున్నారా? చక్కని స్నేహపూర్వక వాతావరణంలో ఉండాలని ఉందా? ఈ రెండు భారతీయ ఢిల్లీ, ముంబయి నగరాలకు దూరంగా ఉండాలని ఓ సర్వే చెబుతోంది. ఆన్ లైన్ ట్యూటరింగ్ మరియు లాంగ్వేజ్ లెసన్స్ ప్లాట్‌ఫారమ్ అయిన ప్రిప్లై ప్రపంచ వ్యాప్తంగా జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైందట. ఈ సర్వేలో ప్రపంచ వ్యాప్తంగా 53 నగరాలు స్ధానికేతరుల పట్ల స్నేహభావంతో ఉంటాయని అంచనా వేశారట. ఇక భారతదేశానికి సంబంధించి ఏ నగరం ఈ స్నేహపూర్వక నగరాల జాబితాలో లేనప్పటికీ ఢిల్లీ, ముంబయి మాత్రం ‘అన్ ఫ్రెండ్లీ’ జాబితాలో చేరాయి. ఘనాలోని అక్రా అతి తక్కువ స్నేహ పూర్వక నగరంగా ర్యాంక్ పొందింది. మొరాకోలోని మర్రకేచ్ రెండవస్ధానంలో ముంబయి, కౌలాలంపూర్, రియో డిజెనీరో మరియు ఢిల్లీ అన్‌ఫ్రెండ్లీ జాబితాలో వరుస స్ధానాలు ఆక్రమించాయి. టొరెంటో, సిడ్నీ 2023లో స్ధానికేతరుల పట్ల స్నేహపూర్వకంగా మెలిగే నగరాలుగా గుర్తించబడ్డాయి. ఎడిన్ బర్గ్, మాంచెస్టర్‌లు వరుసగా రెండు, మూడు స్ధానాల్లో నిలిచాయి. సందర్శకుల రాకపోకలు, భద్రత, సమానత్వం, సంతోషం, భాష ద్వారా కమ్యూనికేషన్ సౌలభ్యం, స్నేహపూర్వకంగా ఉండే సిబ్బంది ఈ ఆరు కొలమానాల ద్వారా ఈ నగరాలను గుర్తించినట్లు తెలుస్తోంది.
స్నేహపూర్వక వాతావరణం కనిపించని ఢిల్లీ, ముంబయి నగరాలు !
June 13, 2023
0
Tags