గుజరాత్ లో భూకంపం

Telugu Lo Computer
0


గుజరాత్ ను ఇప్పటికే బిపర్ జాయ్ తుఫాను వణికిస్తుండగా తాజాగా భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కచ్ జిల్లాలో బుధవారం సాయంత్రం భూమి కంపించినట్లు అధికారులు పేర్కొన్నారు. కచ్ జిల్లాలోని భచౌకకు 5 కిలో మీటర్ల దూరంలో భూమి కంపించినట్లు వెల్లడించారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.5గా నమోదు అయింది. ఈ భూప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని చెప్పారు. మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర జాయ్ తుఫాను తీరం వైపు దూసుకోస్తోంది. సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల మధ్య పాకిస్తాన్ తీరం సమీపంలోని కచ్ లోని ఉన్న జఖౌపోర్టు దగ్గర అది కేంద్రీకృతమవుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)