బీహార్‌లోని బాగల్‌పూర్‌లోని నాలుగు లైన్ల బ్రిడ్జిని ఆదివారం అధికారులు కూల్చివేశారు. ఈ కూల్చివేతపై ఆ రాష్ట్ర సిఎం నితీష్‌కుమార్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ 'బ్రిడ్జిని సరిగ్గా నిర్మించడం లేదు. అందుకే ఈ 2022లో ఏప్రిల్‌లో, ఇప్పుడు రెండుసార్లు బ్రిడ్జి కూలిపోయింది. ఇది చాలా తీవ్రమైన విషయం. ఇప్పటికే ఈ విషయంపై సంబంధిత శాఖ దీనిపై సమగ్ర విచారణ చేపట్టింది. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం' అని ఆయన అన్నారు. అలాగే ఈ సందర్భంగా 'ఈ బ్రిడ్జి 2014లో ప్రారంభించినా, వంతెన నిర్మాణ పనులు ఇంతవరకు ఎందుకు పూర్తిచేయలేదు? ఇప్పటికీ ఇది షెడ్యూల్‌లో ఎందుకు నడుస్తోంది ? దీనిపై కూడా విచారణ చేయవలసిందిగా నేను సంబంధిత శాఖను కోరాను. ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కూడా ఈ నిర్మాణ పనుల పరిణామాలపై పర్యవేక్షిస్తున్నారు' అని నితీష్‌కుమార్ మీడియాకు వెల్లడించారు.
రెండుసార్లు బ్రిడ్జి కూలిపోయింది !
June 05, 2023
0
Tags