ఒడిశాలోని పూరీ జగన్నాథుని రథయాత్రలో పిడుగుపడి ఇద్దరు మృతి చెందారు. ఏటా ఆషాడ శుద్ధ తదియ రోజున జరిగే ఈ రథయాత్రకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు..ఒడిశా ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు కూడా చేసింది. అయితే.. సాయంత్రం జరిగే కార్యక్రమాల సందర్భంగా భక్తులు స్వామివారిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సాయంకాలనికి మారిన వాతావరణం ఉరుములు మెరుపులతో దద్దరిల్లింది. ఒక్కసారిగా పిడుగుపడడంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
జగన్నాథుడి రథయాత్ర లో పిడుగు పడి ఇద్దరు మృతి
June 20, 2023
0
Tags