బీహార్‌లోని మాధేపురా జిల్లాలో ఆదివారం మురళిగంజ్‌లో బీజేపీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రెండు వర్గాలకు చెందిన కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి గన్ తీసి పలు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో బీజేపీకి కార్యకర్త సంజయ్ భగత్ కాలికి బుల్లెట్ గాయమైంది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. కాగా, అక్కడున్న పోలీసులు వెంటనే స్పందించారు. రివాల్వర్‌తో కాల్పులు జరిపిన నిందితుడు పంకజ్ పటేల్‌ను అరెస్ట్ చేశారు. ఆ బీజేపీ కార్యకర్త వద్ద ఉన్న రివాల్వర్‌కు లైసెన్స్ ఉన్నదని పోలీసులు తెలిపారు. గాయపడిన మరో బీజేపీ కార్యకర్త సంజయ్ భగత్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
బీజేపీ కార్యక్రమంలో కాల్పుల కలకలం !
June 25, 2023
0
Tags