తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రానికి చెందిన ఆటో యజమాని బండారు విజయ్ కుమార్ ఆటోలో కిరాయికి వెళ్లి వస్తుండగా,ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో మేకల మందపై బాహుబలి స్టయిల్ లో ఫీట్లు చేస్తున్న కోతి కనిపించడంతో ముచ్చటపడి తన సెల్ ఫోన్ లో వీడియో తీసి వాట్సాప్ లో షేర్ చేశాడు. ఈ కోతి చేష్టలు చూసిన వారు ఓరిని ఏషాలో అనుకుంటూ నవ్వుతున్నారు. అయితే తాటియాకులగూడెం గ్రామం నుండి రోజు మేత కోసం అడవిలోకి వెళ్లి వచ్చే మేకల మందకు కోతి పరిచయమైంది. అప్పటినుండి మేకలతోనే ఉంటూ వాటి పైనే పెత్తనం చెలాయిస్తూ ఇదిగో ఇలా రాజసం వెళ్లబడుతుంది. ఆ మేకల కాపరి కూడా కోతిని చేరదీయడంతో వాళ్లతోనే ఉంటుంది.
మేకల మందపై కోతి ఫీట్లు !
June 09, 2023
0
Tags