వరుణ్‌తేజ్‌ - లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం !

Telugu Lo Computer
0


హీరో వరుణ్‌తేజ్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. కథానాయిక లావణ్య త్రిపాఠితో ఆయన నిశ్చితార్థం నేడు హైదరాబాద్‌లో జరగనుంది. ఈ విషయాన్ని వరుణ్‌తేజ్‌కు సంబంధించిన టీమ్‌ అధికారికంగా వెల్లడించింది. నిశ్చితార్థ వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు కొంత మంది సినీ ప్రముఖులను ఆహ్వానించినట్లు తెలిసింది. ఈ ఏడాది చివరలో వివాహానికి ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. వరుణ్‌తేజ్‌-లావణ్య త్రిపాఠి కలిసి 'మిస్టర్‌’ 'అంతరిక్షం' చిత్రాల్లో నటించారు. ఆ సమయంలోనే వీరిమధ్య ప్రేమ చిగురించింది. తాజా నిశ్చితార్థ ప్రకటనతో అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలందజేస్తున్నారు. ప్రస్తు తం వరుణ్‌తేజ్‌ 'గాండీవధారి అర్జున' చిత్రంలో నటిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)