వైఎస్ వివేకా హత్య కేసులో అరెస్ట్ కావడంతో జైల్లో ఉన్న భాస్కర్ రెడ్డి తన ఆరోగ్యం దృష్యా బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసిన పిటీషన్ ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇస్తే సాక్ష్యులను, దర్యాప్తును ప్రభావితం చేస్తారనే సీబీఐ వాదనతో కోర్టు ఏకీభవించింది. ఈ మేరకు భాస్కర్ రెడ్డి బెయిల్ పిటీషన్ ను డిస్మిస్ చేసింది. వైఎస్ వివేకా హత్య కేసులో అరెస్టైన భాస్కర్ రెడ్డి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. తన ఆరోగ్యం దృష్యా బెయిల్ ఇవ్వాలని భాస్కర్ రెడ్డి నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేసిన సీబీఐ కీలక అంశాలను ప్రస్తావించింది. సీబీఐ విచారణకు సహకరిస్తున్నట్టు భాస్కర్ రెడ్డి చెప్పడం అబద్దం. ఒకవేళ ఆయనకు బెయిల్ ఇస్తే దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఏప్రిల్ 16 నుంచి జైల్లో ఉన్నంత మాత్రాన బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ అధికారులు కోర్టుకు తెలియజేశారు.
భాస్కర్ రెడ్డికి బెయిల్ నిరాకరణ !
June 09, 2023
0
Tags