వాటర్ ట్యాంకర్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

Telugu Lo Computer
0


హైదరాబాద్- విజయవాడ 65వ జాతీయ రహదారిపై నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం ఏపీ లింగోటం వద్ద వాటర్ ట్యాంకర్ ను ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ప్రమాదంలో 40 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక కామినేని ఆసుపత్రికి తరలించారు. స్థానికుల ద్వారా ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో రోడ్డుపై భారీ ట్రాఫిక్ జాం అయింది.

Post a Comment

0Comments

Post a Comment (0)