ఉగ్రవాదంపై ఉక్కు పాదం మోపుతాం !

Telugu Lo Computer
0


జమ్మూ యూనివర్సిటీలో నిర్వహించిన జాతీయ భద్రత సదస్సులో పాల్గొన్న రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఉగ్రవాదంపై ఉక్కు పాదం మోపుతోందని, ఇప్పుడు భారతదేశం గతంలోలా లేదని, శక్తిమంతమవుతూనే ఉందని గుర్తు చేశారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్‌ అంటే ఏమిటో మొత్తం ప్రపంచానికి తొలిసారిగా తెలిసివచ్చిందని తెలిపారు. సర్జికల్‌ స్ర్టైక్స్‌ జరపాలని మోడీ కేవలం 10 నిమిషాల్లోనే నిర్ణయం తీసుకున్నారని వివరించారు. పుల్వామా, యురి ఘటనలు రెండూ దురదృష్టకరమైనవేనన్న రాజ్‌నాథ్‌... సర్జికల్‌ స్ర్టైక్స్‌ జరపాలని పది నిమిషాల్లోనే మోడీ ఆదేశించడం ఆయన సంకల్ప శక్తికి నిదర్శనమన్నారు. జమ్ముకశ్మీర్‌లో శాంతి నెలకొన్న తర్వాత సాయుధ దళాల ప్రత్యేక అధికార చట్టాని తొలగిస్తామని రాజ్‌నాథ్‌ హామీనిచ్చారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడం భారత్‌కు పెద్ద విషయమేమీ కాదని రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు. కాశ్మీర్‌ వంటి అంశాలపై మాట్లాడేందుకు బదులు.. ముందు మీ దేశంలో నెలకొన్న సమస్యలపై దృష్టి కేంద్రీకరించుకోవాలని పాకిస్థాన్‌కు హితవు పలికారు. పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి భారత్‌కు పెద్దగా శ్రమించాల్సిన పనిలేదన్న రాజ్‌నాథ్‌, భారత భూభాగంలో ఉన్నవారు ఎంత ప్రశాంత జీవనం సాగిస్తున్నారో పాక్‌ ఆక్రమణలో ఉన్న ప్రజలు చూస్తున్నారని అన్నారు. 

పీఓకే అప్పుడు, ఇప్పుడు, భవిష్యత్తులోనూ భారత్‌లో అంతర్భాగమే' అని రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. చట్టవిరుద్ధంగా పీఓకేను ఆక్రమించుకోవడం వల్ల పాకిస్థాన్‌కు ఎటువంటి అధికారాలు ఉండవని.. ఇది భారత్‌లో అంతర్భాగమని పార్లమెంటు ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానం చేసిందని గుర్తు చేశారు. ఉగ్రవాదంపై పోరుకు భారత్‌-అమెరికా దేశాలు కలిపి పనిచేస్తున్నాయని మోడీ అమెరికా పర్యటనలో భాగంగా ఇరుదేశాలు సంయుక్తంగా నినదించాయని రాజ్‌నాథ్‌ గుర్తు చేశారు. పాక్‌ భూభాగాన్ని ఉగ్రదాడులకు కేంద్రంగా ఉపయోగించకుండా జాగ్రత్తగా ఉండాలని రాజ్‌నాథ్‌ హెచ్చరించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)