రాహుల్‌ గాంధీ కాన్వాయ్‌ను అడ్డగించిన పోలీసులు !

Telugu Lo Computer
0


మణిపూర్‌లో రెండురోజులపాటు పర్యటించేందుకు రాహుల్‌ గాంధీ అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో గురువారం అక్కడికి చేరుకున్న రాహుల్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. ఆయన కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. హింస చెలరేగిన చంద్రాపూర్‌ జిల్లా వైపుగా ఆయన కాన్వాయ్‌ వెళ్తుండగా ఇంఫాల్‌కు 20 కిలోమీటర్ల దూరంలో బిష్ణుపూర్‌ వద్ద పోలీసులు రాహుల్‌ గాంధీ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ఈ విషయాన్ని పార్టీ సైతం ధృవీకరించింది. జూన్ 29 నుంచి 30 వరకు రాహుల్ గాంధీ మణిపూర్ పర్యటిస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ధృవీకరించిన సంగతి తెలిసిందే. మణిపూర్ దాదాపు రెండు నెలలుగా మండుతోంది. అక్కడ ప్రశాంతత వెల్లివిరియాలంటే సమాజంలో శాంతి అవసరమని కేసీ వేణుగోపాల్ అన్నారు. మే 3న మణిపూర్‌లో హింస చెలరేగినప్పటి నుంచి రాష్ట్రంలో పరిస్థితిపై ప్రతిపక్షాలు నిరంతరం ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. విపక్షాలు కేంద్ర ప్రభుత్వం, బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి. ఈ పార్టీలు ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు ముందు అపాయింట్‌మెంట్ కోరాయి. దీని తర్వాత అన్ని పార్టీలు కలిసి మణిపూర్‌పై మెమోరాండం జారీ చేశాయి. వీటన్నింటి మధ్య హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్ష పార్టీల సమావేశానికి పిలుపునిచ్చారు. సమావేశంలో, హోంమంత్రి ప్రతిపక్ష పార్టీల వాదనలను విని, మణిపూర్‌లో పరిస్థితి త్వరలో సాధారణ స్థితికి వస్తుందని హామీ ఇచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)