జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ పై భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి, డోభాల్ ఒక అంతర్జాతీయ నిధి అని కొనియాడారు. 'ఉత్తరాఖండ్‌లోని ఓ గ్రామం నుంచి వచ్చిన అజిత్ డోభాల్ భారత్‌కు ఒక నిధిలా ఎదిగారు. అంతేగాకుండా అంతర్జాతీయ సంపదగానూ మారారు' అని ఎరిక్ వ్యాఖ్యానించారు. అలాగే అమెరికా, భారత్ మధ్య ఉన్న బంధాన్ని చూసి అబ్బురపడ్డారు. 'ఇరు దేశాల మధ్య బలమైన బంధం ఉంది. భారతీయులు అమెరికన్లను, అమెరికన్లు భారతీయులను ప్రేమిస్తారని స్పష్టంగా తెలుస్తోంది' అని అన్నారు. అలాగే డిజిటల్ పేమెంట్స్, ఫైనాన్సియల్ టెక్నాలజీ రంగాల్లో భారత్ అద్భుతమైన పురోగతి సాధిస్తోందన్నారు. ఒక గ్రామంలోని టీవిక్రేత కూడా ప్రభుత్వం నుంచి పొందుతున్న లబ్ధిని నేరుగా తన ఫోన్‌లోనే చూసుకుంటున్నారన్నారు. డిజిటల్ ఇండియా వల్ల ఇది సాధ్యమవుతోందన్నారు. ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో ఇరు దేశాల ఉన్నతస్థాయి అధికారుల మధ్య సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మోదీ పాలనపై అమెరికా నుంచి ప్రశంసలు వెలువడుతున్నాయి. రెండురోజుల పర్యటనలో భాగంగా భారత్‌కు వచ్చిన అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవాన్.. నిన్న ప్రధానితో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకార పురోగతిని మోదీకి ఆయన వివరించారు. 'మీ పర్యటన కోసం బైడెన్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఘనంగా స్వాగతం పలికేందుకు ఉత్సుకతతో ఉన్నారు' అని సలీవాన్ వివరించారు.
అంతర్జాతీయ నిధి అజిత్ డోభాల్ !
June 14, 2023
0
Tags