మణిపూర్‌లో ఐదు జిల్లాల్లో కర్ఫ్యూ ఎత్తివేత

Telugu Lo Computer
0


కొద్ది రోజుల క్రితం హింసాత్మక ఘటనలతో అట్టుడికిన మణిపూర్‌ రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దాంతో అధికారులు ఆ రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో కర్ఫ్యూ ఎత్తివేశారు. కర్ఫ్యూ ఎత్తివేసిన జిల్లాల్లో తమెంగ్లాంగ్, నోనీ, సెనాపతి, ఉఖ్రుల్‌, కమ్‌జోంగ్‌ ఉన్నాయని పోలీసులు శుక్రవారం వెల్లడించారు. అదేవిధంగా తక్కువ సమస్యాత్మకంగా ఉన్న మరికొన్ని జిల్లాల్లో కొన్ని గంటలపాటు కర్ఫ్యూను సడలించినట్లు మణిపూర్‌ పోలీసులు తెలిపారు. ఇంఫాల్‌ వెస్ట్‌, ఇంఫాల్‌ ఈస్ట్‌, బిష్ణుపూర్‌, జిరిబమ్‌, తౌబాల్‌, కాక్‌చింగ్‌, చురాచంద్‌పూర్‌, చందేల్‌, తెగ్నౌపాల్‌, కంగ్‌పోక్పీ, ఫెర్‌జౌల్‌ జిల్లాల్లో ఇవాళ కొన్ని గంటలపాటు కర్ఫ్యూను సడలించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో సాధారణ పరిస్థితులే ఉన్నాయని అక్కడి పోలీసులు పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)