గురుగ్రామ్‌లో భారీ వర్షం !

Telugu Lo Computer
0


హర్యానాలోని గురుగ్రామ్‌లో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా ఢిల్లీ - గురుగ్రామ్‌ జాతీయ రహదారిపై సుమారు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రహదారిపై రెండు అడుగుల లోతులో నీరు నిలవడంతో కొన్ని వాహనాలు ఎక్కడికక్కడే మొరాయించాయి. గురుగ్రామ్‌ సిటీలో తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా వర్షం పడినట్లు అధికారులు తెలిపారు. గురుగ్రామ్‌ సహా ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురవవచ్చనిఢిల్లీలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం (ఆర్‌డబ్ల్యుఎఫ్‌సి) బుధవారం అంచనా వేసింది. గంటలకు 30 -40 కీమీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)