ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా ఆప్‌ ర్యాలీ !

Telugu Lo Computer
0


ఢిల్లీ ప్రభుత్వ అధికారుల బదిలీలు.. పోస్టింగ్ లపై పట్టుకోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా అధికార ఆమ్ ఆద్మీ పార్టీ పోరాటం ముమ్మరం చేసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుకు వ్యకతిరేకంగా దేశ రాజధానిలోని రామ్‌లీలా మైదానంలో మహా ర్యాలీ నిర్వహిస్తుంది. ఈ నిరసన కార్యక్రమానికి సుమారు లక్ష మంది హాజరు అయ్యారని ఆప్ పార్టీ పేర్కొంది. ఆప్ నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌ తో పాటు పార్టీ నాయకులు పెద్దసంఖ్యలో హాజరు అయ్యారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. రామ్‌లీలా మైదాన్‌ చుట్టూ భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆదీనంలోకి తీసుకుని పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమం కొనసాగుతున్నంత సేపు వాహనాల రాకపోకలను నియంత్రించాలని ట్రాఫిక్‌ పోలీసులను కోరారు. అదేవిధంగా అగ్నిమాపక యంత్రాలు, అంబులెన్సులను సభా వేదిక వద్దకు తరలించారు. రామ్‌లీలా మైదానం ప్రవేశ ద్వారాల వద్ద మెటల్‌ డిటెక్టర్లు, ఆ ప్రాంతం చుట్టూ సీసీటీవీ కెమెరాలను ఢిల్లీ పోలీసులు ఏర్పాటు చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)