జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు. అందువల్ల వారాహి విజయ యాత్రకు రెండు రోజులు విరామం ప్రకటించారు. ప్రస్తుతం భీమవరం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్‌లో పవన్ కల్యాణ్ విశ్రాంతి తీసుకుంటున్నారు. తిరిగి ఈ నెల 30న అంబేద్కర్ సెంటర్లో సభతో పవన్ వారాహి యాత్ర ప్రారంభం కానుంది. కాగా గత వారం రోజుల నుంచి వారాహి విజయ యాత్రలో బిజీబిజీగా ఉంటున్నారు పవన్. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాను చుట్టేసిన ఆయన ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. అవిశ్రాంతంగా సభలు, సమావేశాల్లో పాల్గొనడంతోనే పవన్ ఆరోగ్యం దెబ్బతినిందని తెలుస్తోంది. ఇక ఆరోగ్యం బాగోలేకపోయినా మంగళవారం (జూన్ 27) భీమవరం పార్టీ నేతలతో సమావేశమయ్యారు జనసేన అధినేత. పార్టీ పటిష్ఠతపై సమాలోచనలు చేశారు. ఈ సందర్భంగా భీమవరం సభలో మాట్లాడిన పవన్ కల్యాణ్.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
పవన్ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం
June 28, 2023
0
Tags