ఢిల్లీలో ఓ యువతిని వెంటాడి మరీ ఓ ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. ఆపై తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆ యువతి పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆ వివరాల్లోకి వెళ్తే అమిత్ అనే యువకుడు ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో పని చేస్తున్నప్పుడు, ఓ యువతితో పరిచయం అయ్యింది. తొలి చూపులోనే ఆమె అందానికి దాసోహమైన అమిత్, ఆమె ప్రేమలో పడ్డాడు. ఆమెతో స్నేహం చేసి దగ్గరయ్యాడు. ఒక సమయంలో నిన్ను ప్రేమిస్తున్నాననంటూ తన మనసులోని మాట ఆ యువతికి చెప్పాడు. అయితే ఆ అమ్మాయి అతని ప్రపోజల్‌ని నిరాకరించింది. తనకు ఇలాంటివన్నీ ఇష్టముండదని చెప్పి, అతడ్ని దూరం పెట్టడం మొదలుపెట్టింది. కానీ.. అమిత్ మాత్రం ఆ అమ్మాయిని మర్చిపోలేకపోయాడు. తనని దూరం పెట్టడాన్ని కూడా జీర్ణించుకోలేకపోయాడు. ఆ అమ్మాయి వెంటపడటం ప్రారంభించాడు. నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నానని, నువ్వు లేకుండా ఉండలేనని చెప్తూ ఆమెను వేధించసాగాడు. తన జోలికి రావొద్దని ఆ యువతి తెగేసి చెప్పింది. దాంతో అతడు కోపాద్రిక్తుడయ్యాడు. ఆ యువతిపై ఉన్న ప్రేమ పోయి, అతనిలో ద్వేషం పెరిగింది. తనకు దక్కనిది ఇంకెవరూ దక్కకూడదని భావించి.. ఆమెని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఎప్పట్లాగే అతడు జూన్ 2వ తేదీన ఆ అమ్మాయి వెంట పడ్డాడు. మళ్లీ తన ప్రేమ ప్రస్తావన తీసుకొచ్చాడు. అప్పుడు కూడా ఆ అమ్మాయి నిరాకరించింది. తన వెంట పడొద్దని గట్టిగా వారించింది. ఆ సమయంలో అమిత్ తన వెంట తెచ్చుకున్న కత్తి బయటకు తీసి, ఆ యువతిపై దాడి చేశాడు. అమ్మాయి కేకలు వేయడంతో.. చుట్టుపక్కల వారు సాయం కోసం పరుగులు తీశారు. దాంతో అమిత్ భయపడి.. అక్కడి నుంచి పారిపోయాడు. నేరుగా ఆఫీస్‌కి చేరుకున్నాడు. అక్కడ వింతగా ప్రవర్తించిన అమిత్.. ఆత్మహత్య చేసుకున్నాడు. మరోవైపు.. అమిత్ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ యువతిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెప్తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.
యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది
June 03, 2023
0
Tags