ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లా మొహబ్బత్‌పూర్ పైసా పోలీస్ స్టేషన్ పరిధిలోని కైమా గ్రామంలో ఛోటే లాల్ యాదవ్ అనే రైతుకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కొడుకు ఢిల్లీలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా, కూతురికి ఏడాది క్రితమే వివాహమైంది. చిన్న కుమారుడు రాహుల్ యాదవ్ (22) సిరతులోని ఓ కళాశాలలో బీ.ఫార్మసీ చదువుతున్నాడు. తన చివరి సెమిస్టర్ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. కొవిడ్ కాలంలో రాహుల్ సిరతులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో కొవిడ్ ఆపరేటర్ (కాంట్రాక్ట్)గా పని చేశాడు. ఈ క్రమంలో అతనికి సీహెచ్‌సీలో పనిచేస్తున్న ఓ ఏఎన్‌ఎం(మహిళ)తో పరిచయం అయ్యింది. కొన్ని రోజుల్లోనే అది ప్రేమగా మారింది. వీళ్లు ప్రేమ వ్యవహారం మూడు సంవత్సరాల వరకు కొనసాగింది. ఇంతలో ఏమైందో ఏమో తెలీదు కానీ.. వీరి మధ్య దూరం పెరిగింది. శనివారం ఉదయం రాహుల్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాహుల్ మృతితో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తన జీవితాన్ని నాశనం చేసిందని, తన చావుకి ప్రియురాలే కారణమంటూ.. అతడు సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో తాము ఆధారాలు సేకరించి, చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. రాహుల్ సూసైడ్ చేసుకునేంతలా.. వారి మధ్య ఏం జరిగి ఉంటుందని పోలీసులు ఆరా తీస్తున్నారు.
నా చావుకు ప్రియురాలే కారణం !
June 03, 2023
0
Tags