పోక్సో కేసులో ఆమె మైనర్ కాదా ?

Telugu Lo Computer
0


భాజపా ఎంపీ బ్రిజ్‌భూషణ్‌పై మైనర్ రెజ్లర్‌ పెట్టిన కేసుకు సంబంధించి ఆమె తండ్రి ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. వేధింపులకు గురైనట్లు చెప్తోన్న సమయంలో సదరు యువతి మైనర్ కాదని గుర్తించడంతో, మేజిస్ట్రేట్ ఎదుట ఆమె నుంచి మరోసారి వాంగ్మూలం తీసుకొన్నట్లు తెలుస్తోంది. వేధింపుల కేసు అలాగే ఉందని, ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించిన వయసుకు సంబంధించిన అంశంలో మార్పు చేశారని ఆ యువతి తండ్రి జాతీయ మీడియా సంస్థకు తెలిపారు. ఈ మార్పుతో బ్రిజ్‌భూషణ్‌పై ఉన్న పోక్సో అభియోగాలపై న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాల్సిఉంది. ఆరుగురు రెజ్లర్లతో పాటు మైనర్‌గా పేర్కొన్న మరో యువతి ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీ పోలీసులు ఏప్రిల్ 28న బ్రిజ్ భూషణ్ పై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మైనర్ తండ్రి ఎఫ్‌ఐఆర్ వెనక్కి తీసుకున్నట్లు ఇదివరకు వార్తలు వచ్చాయి. దానిపై అప్పుడే బజరంగ్ పునియా స్పందించారు. ఆ వార్తలపై తాము బాలిక తండ్రిని సంప్రదించగా ఆయన వాటిని తోసిపుచ్చారన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)