బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ లైంగిక వేధింపుల ఆరోపణలతో ప్రధాని నరేంద్ర మోడీ స్పందించకపోవడం శోచనీయమని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఆడబిడ్డలకు ఏం జరిగినా కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. 25 అంతర్జాతీయ పతకాలు తెచ్చిపెట్టిన కూతుళ్లు.. న్యాయం కోసం వీధిన పడ్డారని రాహుల్ ట్వీట్ చేశారు. రెండు ఎఫ్‌ఐఆర్‌లలో లైంగిక వేధింపులకు సంబంధించిన 15 దారుణమైన ఆరోపణలతో ఎంపీ - ప్రధాని భద్రతలో సురక్షితంగా ఉన్నారు. కూతుళ్ల ఈ అవస్థలకు మోడీ ప్రభుత్వమే కారణమని.. అంతకుముందు మే 28న పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవం రోజున రెజ్లర్ల ప్రదర్శన పై రాహుల్ మాట్లాడుతూ పట్టాభిషేకం పూర్తయిందన్నారు. 'అహంకారి రాజు' వీధుల్లో ప్రజల గొంతును నొక్కేస్తున్నాడని ఆరోపించారు.
రెజ్లర్ల లైంగిక వేధింపుల ఆరోపణలకు ప్రధాని స్పందించకపోవడం శోచనీయం !
June 02, 2023
0
Tags