తెలంగాణలో కొత్త అవతారపురుషుడు !

Telugu Lo Computer
0


తమిళనాడుకు చెందిన సురేష్ అనే వ్యక్తికి కలలో ప్రత్యక్షమైన దేవుడు శ్రీకృష్ణుడువి నీవే, విష్ణుమూర్తివి నీవే అని ఉపదేశం చేశాడట. తెలంగాణకు వెళ్లి భక్తుల పూజలందుకోమని కూడా చెప్పాడట. ఇక ఆ కలను నిజం చేయడానికి తమిళనాడు నుంచి తెలంగాణకు వచ్చిన సురేష్ అచ్చం విష్ణుమూర్తి అవతారంలో శేషతల్పంపై శయనిస్తున్నట్టుగా జోగులాంబ గద్వాల జిల్లా కేటి దొడ్డి మండలంలొ జనానికి దర్శనమిచ్చాడు. తమిళనాడు స్వామి సురేష్‌కు లక్కీగా ఇద్దరు భార్యలుండడంతో వారితో పాదసేవ చేయించుకుంటూ తానే వెంకటేశ్వరుడిని అన్నట్టు సీన్ క్రియేట్ చేశాడు. తనకు ఈ ప్రాంతంలో ఉండడానికి కొంత స్థలం కావాలని కోరిన స్వామిజీకి కేటిదొడ్టి మండలం పాగుంఠ వెంకటేశ్వరస్వామి కమాన్ దగ్గరున్న పొలంలో ఏర్పాట్లు కూడా చేశారు. ఇక అక్కడే దకాణం పెట్టిన తమిళనాడు స్వామికి భక్తులు హారతులు పట్టారు. అయితే ఆదివారం మట్టి ఎద్దుల అమావాస్య కావడంతో పాగుంట వేంకటేశ్వర స్వామి ఆలయంకు వెళ్లే భక్తులు తమిళనాడు స్వామిని చూడ్డానికి ఎగబడ్డారు. దీంతో గద్వాల రాయచూరు రోడ్డు దగ్గర ట్రాఫిక్ జామ్ సీన్ కనిపించింది. సమాచారం అందుకున్న కెటిదోడ్డి పోలీసులు నేనే సర్వాంతర్యామిని, నేనే భగవంతుడిని అంటున్న స్వామీజీని స్టేషన్‌కు లాక్కెళ్లి లాకప్ లో వేశారు. అయితే అతడికి గతంలోనే కౌన్సిలింగ్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)