సీతాఫలంలో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటిని తినకుండా ఉంటే మంచిది. కార్బోహైడ్రేట్స్ రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది. ఇందులో సహజ చక్కెరలు ఉంటాయి. సీతాఫలాన్ని ఖాళీ కడుపుతో కాకుండా భోజనంలో భాగంగా తీసుకోవడం చాలా మంచిది. ఇలా తినడం వలన రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. కూరగాయలు, లీన్ ప్రోటీన్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి తక్కువ గ్లైసెమిక్ ఆహారాలతో సీతాఫలాన్ని తినడం మంచిది. ఇది జీర్ణక్రియ, చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. సీతాఫలం తింటే కొంతమందికి అలెర్జీలు వస్తాయి. అలెర్జీ, ఏదైనా ప్రతికూల పరిస్థితి ఉంటే సీతాఫలాలను తినకుండా ఉండటమే ఉత్తమం. ఏదైనా ఆహారం అధికంగా తింటే.. దాని ప్రభావం ఆరోగ్యంపై పడుతుంది. అలాగే సీతాఫలం కూడా అధికంగా తింటే మధుమేహుల్లో షుగర్ లెవల్స్ మరింత పెరిగే ప్రమాదం ఉంది.
మధుమహం - సీతాఫలం !
June 21, 2023
0
Tags