కర్ణాటకలోని మరాజనగర్ జిల్లాలో హనుర్ మండలంలో రాము, ఆయన భార్య లలిత, కూతురు సుశీల కగ్గలి గుండి గ్రామంలో ఉంటున్నారు. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎప్పటిలాగే పాప ఇంటి బయట ఆడుకుంటోంది. అకస్మాత్తుగా అక్కడికి వచ్చిన చిరుత పాపపై దాడి చేసింది. ఇది చూసిన స్థానికులు చిరుత వెంటే పరుగెత్తి పాపను రక్షించారు. ఈ దాడిలో పాప తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన బాలికను ఆస్పత్రికి తరలించారు. అటవీ శాఖ అధికారులు ఆస్పత్రికి చేరుకుని బాలికను పరామర్శించారు. వైద్యులను అడిగి బాలిక పరిస్థితిని తెలుసుకున్నారు.ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టస్తోంది. గ్రామస్తులంతా షాక్ లో ఉన్నారు. రాత్రి వేళల్లో ఇంటి నుంచి బయటకు రావడానికే ప్రజలు జంకుతున్నారు. చిరుత జాడ కోసం ఎంత ప్రయత్నించినా లభించలేదు. ప్రస్తుతం ప్రజలు ఏ దిక్కున చిరుత వస్తుందోనని భయం భయంగా గడుపుతున్నారు.
కర్ణాటకలో ఆరేళ్ల బాలికపై చిరుత దాడి !
June 27, 2023
0
Tags