కర్నాటక యాదగిరి జిల్లాలోని భీమరాయణగుడికి చెందిన ధారూ రాథోడ్ వ్యవసాయ కార్మికుడు. 40 సంవత్సరాల క్రితం టిప్పిబాయి అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. పదేళ్ల తరువాత కమలీబాయి అనే మరో స్త్రీని కూడా వివాహమాడాడు. ఇద్దరి నుంచి విడిపోయాడు. ఆ తరువాత అతని భార్యలిద్దరూ ఉద్యోగాల్లో స్థిరపడి పిల్లలకు పెళ్లిళ్లు కూడా చేశారు. ప్రస్తుతం రాథోడ్‌కు 65 ఏళ్లు వచ్చాయి. వయసు మీద పడటంతో వ్యవసాయ పనులకు వెళ్లడం మానేశాడు. దాంతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. ఈ క్రమంలో అతను భార్యల ఆర్ధిక పరిస్థితిని ఆర్టీఐ ద్వారా ఎంక్వైరీ చేశాడు. మొదటి భార్య 55 సంవత్సరాల టిప్పిబాయి రూ.38,636 , రెండవ భార్య 50 సంవత్సరాల కమలిబాయి రూ.36,896 జీతాలు డ్రా చేస్తున్నట్లు తెలుసుకున్నాడు. వీటి ఆధారంగా చేసుకుని రాథోడ్ వీరిద్దరి నుంచి నెలవారి భరణంగా చెరో రూ.10,000 అంటే నెలకు రూ.20,000 ఇప్పించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశాడు.
ఇద్దరు భార్యల నుంచి భరణం ఇప్పించండి !
June 18, 2023
0
Tags