సాయి పల్లవి సీతగా మరో రామాయణం తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే ప్రభాస్ హీరోగా రామాయణ గాధ ఆధారంగా ఆదిపురుష్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సాయి పల్లవి సీతగా మరో రామాయణం తెరకెక్కుతుండటం ఆసక్తిని రేపుతోంది. ఈ కొత్త ప్రాజెక్ట్ ను బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ డైరెక్ట్ చేయనున్నాడని సమాచారం. ఈ సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్ కనిపించనుండగా, రావణుడి పాత్రలో హృతిక్ రోషన్ చేయనున్నాడట. ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం దర్శకుడు నితీష్ తివారీ వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ జంటగా బవాల్ అనే సినిమాను తెరకెక్కిస్తాన్నాడు. షెరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కంప్లీట్ అయినా వెంటనే.. రామాయణం సినిమాపై ఫోకస్ పెట్టనున్నాడు దర్శకుడు నితీష్ తివారీ. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం రామాయణంలోని ఏ పాయింట్ ను తీసుకుంటారు అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది.
సాయి పల్లవి సీతగా మరో రామాయణం ?
June 07, 2023
0
Tags