రీల్స్, వీడియోలు చేయడం రివాజుగా మారింది. చేతిలో ఫోన్‌తో ఏ దృశ్యాన్నైనా మొబైల్స్‌లో బంధించేస్తున్నారు. ఢిల్లీ మెట్రో వంటి ప్రజా రవాణా వ్యవస్ధల్లో రీల్స్ చేయడం నిషేధించారు. ఈ విషయాన్ని ప్రజలకు చేరవేస్తూ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) వినూత్న ప్రకటనను జారీ చేసింది. ట్విట్టర్‌లో డీఎంఆర్‌సీ షేర్ చేసిన ఈ పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మెట్రోలో రీల్స్ చేయరాదని వార్నింగ్ ఇస్తూ డీఎంఆర్‌సీ ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. జానీ జానీ! యస్ పాపా? మేకింగ్ రీల్స్ ఇన్ ది మెట్రో? నో పాపా! అని అడ్వైజరీలో పేర్కొంది. ప్రయాణీకులకు అసౌకర్యం కలిగించే అలాంటి కార్యకపాలాను ఢిల్లీ మెట్రోలో నిషేధిస్తున్నామని టెక్ట్స్‌లో రాసుకొచ్చింది. ఓపెన్ యువర్ కెమెరా, నా నా నా అని ఈ పోస్ట్‌కు డీఎంఆర్‌సీ క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి పెద్దసంఖ్యలో రియాక్షన్స్ వచ్చాయి. ఢిల్లీ మెట్రో సర్వీసుల నాణ్యతే కాదు..హాస్యం కూడా మామూలుగా లేదని ఓ యూజర్ కామెంట్ చేయగా, ఎంత చక్కటి, ఆకట్టుకునే క్యూట్ వార్నింగ్ ఇచ్చారని మరో యూజర్ రాసుకొచ్చారు.
ఢిల్లీ మెట్రోలో ఇన్‌స్టాగ్రాం రీల్స్ రికార్డింగ్ పై నిషేధం
June 16, 2023
0
Tags