జలంధర్ బిషప్‌గా ఫ్రాంకో ములక్కల్ రాజీనామా

Telugu Lo Computer
0


జలంధర్ బిషప్ పోస్టుకు ఫ్రాంకో ములక్కల్ రాజీనామా చేశారు. తన నిర్ణయాన్ని పోప్‌కు వెల్లడించినట్లు చెప్పారు. ఓ నన్‌ను వేధించిన కేసులో ములక్కల్‌ను  2018లోనే పాస్టర్ బాధ్యతల నుంచి తప్పించిన విషయం తెలిసిందే. వాటికన్‌కు చెందిన హోలీ సీ తన రాజీనామాను అంగీకరించినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆయన్ను ఫ్రాంకో ములక్కల్ ఎమిరటస్‌గా పిలువనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన పోప్‌ను ఆయన కలిశారు. కొట్టాయంలోని జిల్లా సెషన్స్ కోర్టు రేప్ కేసులో ములక్కల్‌ను నిర్దోషిగా తేల్చింది. జలంధర్ బిషప్‌గా ఉన్న సమయంలో ఫ్రాంకో ములక్కల్ తరుచూ కొట్టాయం విజిట్ చేసేవారు. ఆ సమయంలో ఆయన ఓ నన్‌ను లైంగికంగా వేధించారు. 2014 నుంచి 2016 మధ్య కాలంలో అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)