తగ్గిన వాణిజ్య గ్యాస్ సిలిండర్‌ ధర

Telugu Lo Computer
0


జూన్‌ 1న వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌పై రూ.83.5 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అయితే గత నెలలో అంటే మే 1న ఇదే సిలిండర్‌ ధరపై రూ.172 తగ్గింది. ప్రస్తుతం గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్‌ ధరల్లో ఎలాంటి మార్పులు లేదు. కేవలం కమర్షియం సిలిండర్‌ ధరల్లో మార్పు ఉంది. న్యూ ఢిల్లీలో వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌పై రూ.83.5 తగ్గి ప్రస్తుతం రూ.1773కు చేరుకుంది. గత నెలలో వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1856.50 ఉండేది. ఈ సమయంలో డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1103 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో 1960.50 ఉండగా, తగ్గింపు తర్వాత రూ.1875.50కి చేరింది. ముంబైలో రూ.1808.5 నుంచి రూ.1725కి తగ్గింది. అలాగే చెన్నైలో 2021.50 నుంచి రూ.1937కు చేరింది.

Post a Comment

0Comments

Post a Comment (0)