తాళి కట్టిన భర్తకు రాఖీ కట్టిన యువతి !

Telugu Lo Computer
0


రాజస్థాన్ జోధ్ పూర్ కు చెందిన తరుణ శర్మ అనే యువతి తన చిన్ననాటి స్నేహితుడు సురేంద్రను ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఈ వివాహం యువతి కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. దీంతో పెళ్లైన పదిరోజులకు ఈ జంటను గుర్తించి వేరు చేశారు. అనంతరం యువతిని తమ కులానికి చెందిన ఛత్తీస్ గఢ్ లోని అంతఘర్ పట్టణానికి చెందిన జితేంద్ర జోషి అనే వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేశారు. అయితే, ఆ వివాహం యువతికి అస్సలు ఇష్టం లేదు. దీంతో పెళ్లైన వెంటనే రెండో భర్తకు ఆమె రాఖీ కట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నిజానికి, ఆమెకు ముందే పెళ్లి జరిగిందనే విషయం ఆ వరుడు కుటుంబానికి తెలియదు. ఈ ఘటనతో అసలు విషయం తెలుసుకున్న వరుడు, వధువుకు సపోర్ట్ గా నిలిచాడు. దీంతో ఆ యువతి తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న మొదటి భర్త వద్దకు వెళ్లిపోయింది.

Post a Comment

0Comments

Post a Comment (0)