బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన దసరా మూవీ కోసం వర్క్ చేస్తే కనీసం డబ్బులు ఇవ్వలేదని జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ శ్రీను చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఏజెంట్ శ్రీను ఈమేరకు స్పందించాడు. "ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్టులను చాలా చీప్ గా చూస్తారు. వచ్చేదాకా మంచిగా మాట్లాడతారు, వెళ్ళాక కనీసం పట్టించుకోరు. డబ్బులు కూడా సరిగా ఇవ్వరు. దసరా సినిమా కోసం 23 మందిని గోదావరిఖని వెళ్ళాను. వారం రోజుల పాటు అక్కడే ఉన్నాము కానీ ఇప్పటివరకు కూడా డబ్బులు ఇవ్వలేదు. పైనుండి నాకే 70 వేలు ఖర్చు అయింది. నేను తీసుకెళ్లిన వాళ్ళు నన్నే కదా అడుగుతారు. నేను కూడా మొత్తం ఇవ్వలేదు సగమే ఇచ్చాను. ఇలాంటివి ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంటాయని" శ్రీను చెప్పుకొచ్చాడు.
దసరా సినిమాకు నాకు డబ్బులు ఇవ్వలేదు !
June 13, 2023
0
Tags