ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలం గోకవరంలో చేపల కోసం కాలవలో వల కట్టారు మత్స్యకారులు. ఆ తర్వాత వెళ్లి చూడగా అందులో చేపలుగా బదులు పెద్ద కొండచిలువ కనిపించింది. దీంతో అందరూ కంగుతిన్నారు. అది సుమారు 15 అడుగుల పొడవు ఉంది. అయితే దాన్ని సురక్షిత ప్రాంతంలో వదిలెయ్యకుండా ఒడ్డుకు తెచ్చి మత్స్యకారులు కొట్టి చంపారు. దీనిపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా పాములు లేదా ఇతర వన్యప్రాణులు కనపడినప్పుడు ఫారెస్ట్ సిబ్బంది సమాచారం ఇవ్వాలి కానీ ఇలా కొట్టి చంపడం సరి కాదంటున్నారు. ప్రమాదవశాత్తూ ఏ పాము కరిచినా, బాధితుడికి ధైర్యం చెప్పడం ముఖ్యమంటున్నారు నిపుణులు. అనవసరంగా భయపెట్టడం వల్ల గంటలోనే చనిపోయే ప్రమాదం ఉందంటున్నారు. కింగ్ కోబ్రా వంటి ప్రమాదకర పాములు కరిచాక మూడు గంటల సమయం ఉంటుందని.. బాధితుడిలో ధైర్యం నింపకపోతే.. అంతకు ముందే ప్రాణాలు కోల్పోవడం ఖాయమంటున్నారు డాక్టర్లు.
వలలో చేప బదులు పెద్ద కొండచిలువ !
June 13, 2023
0
Tags