నిందితులను పట్టించిన కండోమ్ !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్‌నగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో పూర్తిగా కాలిపోయిన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడు సర్కస్ కళాకారుడు అజబ్ సింగ్‌గా గుర్తించారు. అజబ్‌ను వేరే ప్రాంతంలో హత్య చేసి, ఆపై పాఠశాలకు తీసుకువచ్చి ఇక్కడి ఫర్నీచర్‌తో సహా మృతదేహాన్ని తగల బెట్టినట్లు గుర్తించారు. కండోమ్ ప్యాకెట్ సహా చిన్నపాటి క్లూస్ లభించాయి. ఇందులో కండోమ్ ప్యాకెట్ కేసు మొత్తాన్ని మలుపు తిప్పింది. ఆ కండోమ్ కేసులో ట్విస్ట్ ను తీసుకొచ్చింది. జూన్ 11న, అక్బర్‌పూర్ బ్లాక్ పరిధిలోని భిత్రి దీహ్ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాల లో అజబ్ సింగ్ మృతదేహం కలకలం రేపింది. హత్య జరిగిన ప్రదేశంలో పోలీసులు ఇతర ఆధారాల తో పాటు టైమెక్స్ బ్రాండ్ కండోమ్ ప్యాకెట్‌ ను స్వాధీనం చేసుకున్నారు.. నిజానికి సహరాన్‌పూర్‌ జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు సర్కస్‌ ఏర్పాటు చేసేందుకు ఈ గ్రామానికి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వీరంతా ఆర్తి అనే మహిళ ఇంట్లో బస చేశారు. దీని ఆధారంగా ఆ ఇంటి పరిధిలో యాక్టీవ్‌గా ఉన్న మొబైల్ నెంబర్స్, కాల్స్, నెట్‌వర్క్ ఆధారంగా ఎంక్వైరీ చేశారు. అక్రమ సంబంధం కారణంగా చంపినట్లు తెలుస్తుంది. హత్య అనంతరం నిందితు లు ఆ ఇంటి నుంచి పరారైనట్లు గుర్తించారు. అసలు కారణం అక్రమ సంబంధం అని తెలిసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)