తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల పాఠశాల విద్యకు అయ్యే ఖర్చులు భరిస్తాం !

Telugu Lo Computer
0


ఒడిశా రైలు దుర్ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను ఆదుకునేందుకు ప్రముఖ పారిశ్రామికవేత గౌతమ్ అదానీ ముందుకు వచ్చారు. పిల్లల పాఠశాల విద్యకు అయ్యే ఖర్చులు తాము భరిస్తామని ఆయన ప్రకటించారు. ఆదివారం ట్విట్టర్ ద్వారా అదానీ స్వయంగా ఈ ప్రకటన చేశారు. 'ఒడిశా దుర్ఘటన మనందరినీ తీవ్ర విచారంలో ముంచెత్తింది. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల పాఠశాల విద్య బాధ్యతను అదానీ గ్రూప్ చేపట్టాలని నిర్ణయించాం. బాధితులు, వారి కుటుంబాలకు చేయూత నివ్వడం, పిల్లల రేపటి భవిష్యత్తకు అండగా ఉండాల్సిన బాధ్యత మనందరిపై ఉంది' అని అదానీ ఆ ట్వీట్‌ చేశారు. ఇక ఈ ఘోరప్రమాదం నేపథ్యంలో ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ కీలక ప్రకటన చేసింది. ఒడిశా రైలు ప్రమాద బాధితులకు పాలసీ క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియలో కొన్ని మినహాయింపులు కల్పించనున్నట్టు తెలిపింది. బాధితుల బంధువులకు ఈ ప్రత్యేక రిలీఫ్ ఇవ్వనున్నట్టు ఎల్ఐసీ చైర్మన్ సిద్ధార్థ మొహంతీ ప్రకటించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)