ఓం శాంతి అంటూ ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌ !

Telugu Lo Computer
0


ఒడిశా పెను విషాదంపై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా విచారం ప్రకటించారు. ఏకకాలంలో మూడు రైళ్లు ఒకదానికొకటి ఢీ కొన్న ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి జ్ఞాపకార్థం దేశవ్యాప్తంగా నిశ్శబ్దంగా ఉండిపోవాల్సిన ఒక విషాదం. ఓం శాంతి అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. "ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగనివ్వకూడదు. ఈ విషాదానికి మూలకారణాన్ని తెలుసుకోవాలి. మానవ తప్పిదమైనా లేదా సాంకేతిక తప్పిదమైనా, ఇంత వినాశనానికి దారితీయకూడదు. రైల్వే ఆపరేషన్‌లోఫెయిల్-సేఫ్ మెకానిజమ్‌ వ్యవస్థను మరోసారి సమీక్షించుకోవాలి'' అని ఆనంద్‌ మహీంద్ర పేర్కొన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)