పట్టాలు తప్పిన మాథెరాన్ టాయ్ ట్రైన్

Telugu Lo Computer
0


ఒడిశాలో ట్రైన్​ యాక్సిడెంట్ మిగిల్చిన విషాదం మరువకముందే మహారాష్ర్టలో మరో రైలు ప్రమాదం జరిగింది. అయితే ఈ యాక్సిడెంట్​లో అందరూ సేఫ్ గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మథేరన్​ హిల్​స్టేషన్​ నుంచి నేరల్​కు టాయ్​ ట్రైన్​ బయల్దేరింది. ముంబైకి 95 కి.మీ.ల దూరంలో ఉన్న జుమ్మా పట్టి స్టేషన్​ సమీపంలో రైలు పట్టాలు తప్పింది. డ్రైవర్​ అప్రమత్తం అయి వేగాన్ని అదుపులోకి తేవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో ట్రైన్​లో 95 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు చెప్పారు. వారు వేరే మార్గాల్లో గమ్మస్థానాలకు చేరారని వెల్లడించారు. రైల్వే సిబ్బంది సమస్య పరిష్కరించడంతో శనివారం అర్ధరాత్రి ట్రైన్​ నేరల్​ స్టేషన్​ కు చేరుకుంది. నేరల్​ నుంచి మాథేరన్​కు వెళ్లే చివరి రైలు రద్దు అయినట్లు రైల్వే ఆఫీసర్లు చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)